Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: మూలం సంత

మూలం సంత

🎡 ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య వారధిగా ప్రకృతి మేళాలు, సంతల నిర్వహణలో
🌱🌾🍚🍛🍦* ” మూలం సంత ” “* 🪴🌽 🐝🍆🍅

  • Let’s get “Back to our Roots”…

గ్రామ భారతి 28 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భాన ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య వారధి ఏర్పాటు చేయటానికి గ్రామ భారతి మరియు CSR Memorial Foundation సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు విక్రయించుకోవటానికి గాను వినియోగదారుల కోసం ప్రతి నెల రెండో శనివారం * ఉదయం 10 గంటల నుండి తార్నాకలోని మర్రి కృష్ణా హాల్లో ఏర్పాటు చేస్తున్నామని CSR Memorial Foundation founder కొత్తపల్లి కృష్ణ గారు మరియు గ్రామ భారతి స్వచ్ఛంధ సంస్థ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు సూర్య కళ గారు తెలిపారు

🏵️ గో ఆధారిత – సహజ – ప్రాకృతిక – దేశవాళీ – స్వదేశీ – విష రహిత – గ్రామీణ – చేతి వృత్తుల – కుటీర పరిశ్రమల… పంటలు, వివిధ వస్తువులు, గోమయ విగ్రహాలు – ఇటుకలు – పేంట్లు – సమిధలు – స్మశాన కడ్డీలు – అలంకరణ సామగ్రి – ఆంటీ రేడియేషన్ చిప్స్; కళాకృతులు, సహజ రంగుల పొడులు; దీర్ఘకాలిక వ్యాధులన్నింటినీ తగ్గించుటకు… పాదం క్రింద పెట్టుకొనే పెద్ద పిడకలు; పంచగవ్య – ఆయుర్వేద ఔషధాలు; విష రహిత ఎరువులు – క్రిమి నియంత్రక కషాయాలు
మొదలైన…నిత్యజీవితంలో అవసరమైన అన్నిరకాల వస్తువులను తయారు చేసి, స్వయంగా వచ్చి గ్రామీణులు అమ్ముకొనుటకు, దళారులను దూరం చేయుటకు, జీవనోపాధి పొందుటకు, స్వావలంబనతో ముందుకు సాగుటకు, తద్వారా ప్రకృతిని- పర్యావరణాన్ని కాపాడుటకు చేసే ఒక ప్రయత్నం మరియు ప్రోత్సాహమే…ఈసంతల ఏర్పాటు ఉద్దేశ్యం అని గ్రామ భారతి పెద్ధలు మార్గదర్శకులు ఆకుతోట రామారావు గారు తెలిపారు

స్టాల్ తీసుకున్న వారికి భోజనం, టేబుల్, కుర్చీలు, శుభ్రత మరియు కరెంట్ వంటి ఏర్పాట్లకోసం కేవలం 500 రూపాయల రుసుము తీసుకుని స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు

ప్రత్యేక ఆకర్షణలు:

  • ఆరోగ్యకర మిల్లెట్ ఆహారం
  • ⁠నోరూరించే మిల్లెట్ ఐస్క్రీం
    -గోమయం తో చేసిన పేంట్ , పుట్టి , గోమయం యోగా మాట్ ఇలాంటి ఎన్నో వస్తువులు ఏర్పాటు చేసినట్టు
  • ఇంటి పంటలు , దేశీ విత్తనాలు
  • స్వచ్ఛమైన ఎద్దు గానుగ నూనెలు

*కార్యక్రమానికి Media partner గా

  • Back to roots YouTube channel (బాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్)
  • MyIndMedia మరియు Prajavaani TV

Food partnersగా:

  • నయా మిల్లెట్స్ (నయా మిల్లెట్స్) మరియు
  • యశోదా ఓర్గానిక్స్ నిలిచాయి

యూత్ ఫర్ సేవా, రాజ్మాతా ఫౌండేషన్ మరియు Oyster foundation కార్యకర్తలు

కార్యక్రమంలో Ex NABARD CGM గ్రామ భారతి గౌరవ అధ్యక్షులు పాలాది మోహనయ్యగారు, కార్యదర్శి మోహన్ గారు , సభ్యులు రాజమౌలిగారు, బొమ్మకంటి మల్లేషంగారు, మదన్ గుప్తగారు, భారతీయ కిసాన్ సంఘ్ దోనూరి రాము గారు , AV రావు గారు , సుబ్రహ్మణ్యం రాజు గారు, రంగారావు గారు, టిడిఎఫ్ నరేందర్ గారు, ప్రకృతి రైతులు , సునంద గారు , రజిత గారు తదితరులు కూడా పాల్గొన్నారు

ప్రవేశం ఉచితం

మర్రి కృష్ణా హాల్, తార్నాక

ఇందులో:

  • గో ఉత్పత్తులు
  • చేనేత దుస్తులు, వస్త్రాలు
  • కుల వృత్తులు, చేతి వృత్తులు
  • మిద్దెతోట, దేశీ విత్తనాలు, మొక్కలు
  • వ్యవసాయ విలువ జోడింపు ఉత్పత్తులు
  • గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు
  • ఆయుర్వేద, పంచగవ్య లాంటి ఆరోగ్య విషయాలు
  • మిల్లెట్ ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన తినుబండారాలు
  • దేశం, ధర్మం, ప్రకృతి వ్యవసాయం మరియు పాడి పై పుస్తకాలు, సాహిత్యం
  • ప్రకృతి మరియు ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులు
  • మరియు రైతులకు, చిన్న వ్యాపారస్తులకు ఉపయోగపడే ఉపకరణాలు