Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: public safety message

Be Alert Until Marriage: Hyderabad CP Sajjanar Warns Women Against Marriage Frauds

Hyderabad Police Commissioner Sajjanar has issued a strong warning to women to remain cautious until they get married, amid rising cases of marriage-related frauds in the city.

He stated that fraudsters are increasingly targeting women under the pretext of marriage, not only in love marriages but also in arranged alliances finalized by families. According to him, several complaints related to such incidents have recently been received by the police.

The accused often follow traditional customs like bride-viewing ceremonies and engagements to gain trust. Once the marriage is considered confirmed, they emotionally manipulate the women, coerce them into physical relationships, and later reveal their true intentions.

After fulfilling their demands, the fraudsters allegedly demand large sums of money or additional dowry, threatening to cancel the marriage if their demands are not met. Fear of social stigma and loss of reputation after engagement often prevents victims and their families from coming forward, which the offenders exploit further.

Commissioner Sajjanar urged women not to blindly trust even arranged proposals and advised them to carefully observe the groom’s behavior, habits, and social circle. He emphasized that any pressure for physical intimacy or private meetings before marriage should be treated as a serious red flag.

He assured that victims should not fear blackmail or monetary demands and must report such cases immediately. The identity of complainants will be kept strictly confidential.

Women facing such issues can contact Hyderabad SHE Teams via WhatsApp at 9490616555 or call Dial 100 for immediate assistance.


అమ్మాయిలూ జాగ్రత్త.. పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలి: హైదరాబాద్ సీపీ సజ్జనార్

పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం అమ్మాయిలనే టార్గెట్‌గా చేసుకుని కొందరు కేటుగాళ్లు పక్కా ప్లాన్‌తో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

ప్రేమ పెళ్లిళ్లే కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహాల మాటున కూడా మోసాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లి చూపులు, నిశ్చితార్థం పూర్తయ్యాక పెళ్లి ఖాయమైందన్న చనువుతో యువతులకు దగ్గరవుతున్నారని, ఆ తర్వాత ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి శారీరకంగా లోబరుచుకుంటున్నారని వెల్లడించారు.

తీరా తమ ఉద్దేశం నెరవేరిన తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేయడం, అదనపు కట్నం ఇవ్వకపోతే పెళ్లి రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. నిశ్చితార్థం జరిగిపోయి సమాజానికి విషయం తెలిసిపోవడంతో పరువు పోతుందనే భయంతో చాలా మంది ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారని, ఇదే మోసగాళ్లకు అవకాశంగా మారుతోందని సజ్జనార్ పేర్కొన్నారు.

పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలని, పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవాలని లేదా శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే తప్పకుండా అనుమానించాలని, ధైర్యంగా తిరస్కరించాలని చెప్పారు.

డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్‌మెయిల్ చేసినా భయపడవద్దని, వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనల్లో బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు లేదా డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.